భువనగిరి, మేజర్‌న్యూస్ : టీఆర్‌ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టా లని టీఆర్‌ఎస్ నేతలకు, కార్యకర్తలకు మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాం లో ప్రాజెక్టులు పూర్తి చేయలేదని తెలిపారు. టీఆర్‌ఎస్ చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పార్టీకి సేవ చేసిన ప్రతీ కార్యకర్తకు కేసీఆర్ న్యాయం చేస్తారని చెప్పారు. వారం రోజుల్లో నామినేటెడ్ పదవులను సీఎం కేసీఆర్ భర్తీ చేయ బోతున్నారని తెలిపారు. 95 కొనుగోలు కేంద్రాల ద్వారా 12 లక్షల క్వింటాళ్ల కందులు కొన్నామని పేర్కొన్నారు. 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మించామని గుర్తు చేశారు. బస్వాపూర్, గంధమళ్ల రిజర్వాయర్ల ద్వారా 2.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. పునాదిగాని కాలువకు రూ. 284 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.అన్ని పనులకు కాంగ్రెస్ నేతలు అడ్డుతగులుతున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని అన్నారు. ఒక్కక్కటిగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్‌ట ద్వారా యాదాద్రి జిల్లాకు సాగునీరు అందిస్తున్నామని ఆయన వివరించారు. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు అమలుచేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa