ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొరికితేనే.. దొంగ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 01:19 AM

-జోరుగా జీరో దందా...
-అనుమతులు లేకున్నా పైనాన్‌‌స నిర్వహణ
-రిజర్‌‌వ బ్యాంకు నిబంధనలు తుంగలోకి
-వ్యాపారంలోకి దిగుతున్న ప్రభుత్వ ఉద్యోగులు
-లక్షల్లో నష్టపోతున్న సామాన్యులు
-రూ. కోట్లలో అక్రమ లావాదేవీలు

 కరీంనగర్‌-సూర్యప్రత్యేకప్రతినిధి: మోసం...మోసం.. నిలువునా మోసం.. చిట్టిల పేరుతో కొందరు జీరో దందాకు తెరలేపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, ఉపాద్యాయులు ఇందులో భాగస్వాములై అనుతమతుల్లేకున్నా దొంగచాటుగా ఈ వ్యాపారాన్న కొనసాగిస్తున్నారు. రిజర్వు బ్యాంకు నిబంధనలు తుంగలో తొక్కి చిట్‌‌స ద్వారా పైనాన్‌‌స రిజిస్ట్రేషన్‌ చేయించకుండానే గుట్టుగా జీరో దందాను నడిపిస్తున్నారు. నమ్మకం అనే ముసుగులో ప్రజల  నుంచి లక్షల రూపాయాలు జమ చేయించుకుంటున్నారు. సాయంత్రం కాగానే అడ్డాల మీదకు చేరుకొని లక్షల్లో లావాదేవీలు జరుపుతున్నారు. ప్రజలు కట్టిన డబ్బును తిరిగి చెల్లించేటప్పు మాత్రం మకాం మార్చుతున్నారు. అంతా అయిపోయాక డబ్బు లేదంటు భాధితులకు ఐపి నోటిసులు పంపిస్తున్నారు.ఉమ్మడి కరీంనగర్‌జిల్లాలో  అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంతో విఫలమవుతున్నారు. జిల్లాలో చిట్టిల వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రజల్లో మంచితనం  చూపించి వారి నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు వ్యాపారాన్ని అనుమతి పొందిన వారు మాత్రమే రిజర్‌‌వ బ్యాంకు నిబంధనల ప్రకారం  ఈ చిట్‌‌స వ్యాపారాన్ని కొనసాగించాలి. కాని కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాల కేంద్రంతో పాటు పలు పట్టణాలలో,గ్రామాలలో  జోరుగా అనుమతి లేని చిట్టి వ్యాపారా కేంద్రాలు వందల సంఖ్యలో ఏర్పడ్డాయి.  తోటి ఉద్యోగులతో కూడా చిట్టిలు వేయించి డబ్బులు ఇవ్వకుండా మొసం చేసిన సందర్బాలు ఉన్నాయి.
లక్షల్లో లావాదేవీలు...
చిట్‌ఫంఢ్స చట్టం 1982 ప్రకారం నిబంధనలకు లో బడి జిల్లా చిట్‌‌స రిజిస్ట్రార్‌ శాక పరంగా అనుమతి పొందిన వారు మాత్రమే ఈ వ్యాపారం చేయాలి. అలా కాకుండా ఇప్పుడు నడుస్తున్న దందా లక్షల్లో కొనసాగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు, ఉపాద్యాయులు, ప్రభుత్వ శాఖల్లో పని చేసే వారు ఈ వ్యాపారంలో బిజిగా ఉన్నారు. ఉద్యోగం అయిపోగానే కుటుంబానికి సమయం ఇవ్వలేనంత బిజిగా ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారు.
కమీషన్‌ కోసం కక్కుర్తి
  ఈ వ్యాపారం కేవలం మనిషిని మాత్రమే నమ్మి డబ్బు కడుతున్నారు. అసలు చిట్టిలో డబ్బు జమ చేయవచ్చా, లేదా అలా జమచేస్తే గనుక నడిపే వ్యక్తికి వ్యాపారానికి అనుమతి ఉందా అనే విషయాలు పరిగణలోకి తీసుకోకుండానే చిట్టిలో చేరిపోతున్నారు. చిట్టిలలో ƒ క్కుర్తి పడి అందులో చేరిపోతున్నారు. అలా వారు అందులో చేరినట్టు ఏ విధమైన రూడ పత్రాలు ఉండక పోయిన కేవలం వ్యక్తి తెలుసనే నమ్మకంపైనే చిట్టి కడుతున్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa