ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మావోల బంద్‌ నేపథ్యంలో అలర్‌‌ట అయిన పోలీసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 01:25 AM

  మేజర్‌న్యూస్‌ తెలంగాణ ప్రతినిధి : బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు పోలీ సులు మావోల కదలికలపై జడేగకన్నువేసి ఏజెన్సీలోని అడవులను జల్లెడ పడు తున్నారు. గత కొంతకాలంగా ఎన్నో ఒడి దుడుకులను ఎదుర్కొంటూ ఉత్తర తెలంగాణలో  మునుపటికన్న ఎక్కువ శాతం వారి ప్రాభల్యాన్ని  కోల్పో యి వెనుకడుగు వేసిన మావోలు ప్రస్తుతం తమ పట్టు సాదించుకునేందుకు ముంద డుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు జిల్లాలోని పోలీసులు అప్రమ త్తమై మావోల కదలికలపై గట్టి నిఘా పెట్టారు.  ఈ క్రమంలో ఆయా పోలీస్‌ స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయడమే కాకుండా, ముందస్తు ఛర్యల్లో బాగంగా  ప్రజా ప్రతినిధులను, నేతలను అప్రమత్తంగా ఉండడానికి పట్టణా లకు వెల్లాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ మేరకు వరంగల్‌ జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఏటూరునాగారం అడవుల్లో కూంబింగ్‌ తీవ్రతరం చేసి అడవులను జల్లెడ పడుతున్నారు. వారోత్సవాలు ప్రారంభం కావడంతో పోలీసులు పట్టుదలతో నక్సల్‌‌స ఛర్యలను సమర్థవంతంగా ఎదుర్కొని వ్యూహాలను తిప్పికొట్టేందుకు సన్నద్దమయ్యారు.  కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, జిల్లాలకు, చత్తీష్‌గడ్‌ రాష్ర్ట సరిహద్దు ప్రాంతమైన ఏటూరునాగారం మండ లంలోని పలు గిరిజన గ్రామా తోపాటు అడవుల్లో పోలీసు బలగాలు పెద్ద మెత్తంలో మోహరించారు. ఈ నేపధ్యంలో మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో తమ పార్టీ నాయకత్వాన్ని, క్యాడర్‌ ను కోల్పోతున్నారు. నాటి నుండి ఇప్పు డిప్పుడే తేరుకుంటున్న మావోలు శత్రువును దెబ్బతీయడమే లక్ష్యంగా తీసుకోవడం కాకుండా, రాజ్యా హింసకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది.  ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ తమకు ప్రాభల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో అమరవీరుల స్థూపాలను ఏర్పాటుచేసి విప్లవోద్యమంలో అసువులు బాసిన వారికి ఘనంగా నివాళులు అర్పించడం, సభలు, సమావేశాలు, నిర్వహించడం, టార్గెట్లను మట్టుబెట్టడం, శత్రువులపై దాడులు చేయడం వంటి కార్యకలాపా లకు నాటి పీపుల్‌‌సవార్‌ నుండి నేటి మావోయిస్టుల వరకు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీ క్యాడర్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా విప్లవోద్యమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపి అనిచి వేస్తుండడంతో తమ క్యాడర్‌ను సేఫ్‌ జోన్‌కు తరలించి విప్లవోద్యమ నాయకత్వంకుడా ఛత్తీస్‌ఘడ్‌ లాంటి ఇతర రాషా్టల్రకు తరలివెల్లి తల దాచు కుంది. ఆయా ప్రాంతాల్లో కూడా ఈ మధ్య కాలంలో గ్రీన్‌హంట్‌ పేరుతో పోలీ సుల నిర్భందం పెరిగిపోవడం ఎన్‌కౌంటర్లలో పెద్దెత్తున నక్సలైట్లు హతం కావడం ఛత్తీస్‌ఘడ్‌ లాంటి ప్రాంతాలపై ప్రభుత్వం డేగ కళ్ళతో నిఘాను కొనసా గిస్తుండడంతో అక్కడినుండి మావోయిస్టులు తిరిగి తెలంగాణలోకి చొరబడి నట్లు సమాచారం. తదననంతరం గత ఏడాది తాడ్వాయి మండలం వెంగలా పురం అడవుల్లో సృతి, సాగర్‌లను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. దీంతో టిఆర్‌ఎస్‌ నాయకులకు దడపుట్టింది.
 ఆనాటి నుండి నేటి వరకు ఏజెన్సీ లో మవోల కదలికలు ఎక్కువ కావడం, తాడ్వాయి పారెస్‌‌ట గెస్‌‌ట హౌజ్‌, కమాండర్‌ జీపును తగులబెట్టి తమ ఉనికిని చాటుకున్నారు. గతంలో మండలంలోని తుపాకులగూడెం, రామన్నగూడెం, కంతనపల్లి గోదావరి పడవ రేవుల ద్వారా  ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంనుండి మావోలు ఏటూరునాగారం అడవులకు చేరుకుంటా రనే అనుమానంతో పోలీసులు పడవ రేవుల వద్ద గట్టి నిఘాను పెట్టారు.  ఏది ఏమైనప్పటికీ బంద్‌ సందర్భంగా ఏజెన్సీలో పోలీసులు గట్టి భద్రత చర్యలను చేపట్టి, మావోయిస్టులు గిరిజన గ్రామాల్లో చొరబడ్డారనే అనుమానంతో పల్లె పల్లెలో తిరుగుతూ ప్రతీ ఇల్లును సోదా చేస్తున్నారు.  పల్లెలతోపాటు రాత్రి, పగలు తేడా లేకుండా అడవుల్లో కూంబింగ్‌ చేపట్టారు. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు ఎప్పుడేం  జరుగుతుం దోనని భయంతో బిక్కు బిక్కు మంటున్నారు.

SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa