-సింగరేణి ఏరియాలో పర్యటించిన కిషన్‌రెడ్డి
-ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్
-తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న బిజెపి పెద్దలు
-కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ
-హైకోర్టు విభజనపై బిజెపిని టార్గెట్ చేసిన టిఆర్‌ఎస్
-కావాలనే టి అడ్వకేట్లతో ఆందోళన చేయించారన్న లోకల్ లీడర్‌స
-విభజన హమీలను అమలు చేయిస్తామంటున్న డాక్టర్ లక్ష్మణ్
-బిజెపి పెద్దల వ్యాఖ్యలను ఖండించిన తెలంగాణ మంు్తల్రు
మేజర్‌న్యూస్ తెలంగాణ ప్రతినిధి: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్ర సర్కార్‌ను నడుపుతున్న టిఆర్‌ఎస్ నేతల మద్య మాటల యుద్దం నడుస్తోంది. నాలుగు రోజుల పాటు సింగరేణి ప్రాంతంలో పర్యటిస్తున్న కిషన్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులకు ప్రతత్యేక గుర్తింపు ఉందన్నారు. వారికిచ్చిన అన్ని హమీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక దేశ వ్యాప్తంగా నరేంద్ర మోఢీ ఇమేజ్‌ను పెంచేందుకు బిజెపి నేతలు, కేంద్ర మంత్రులు ప్రయ త్నిస్తున్నారు. అందులో బాగంగా తెలంగాణ పై బిజెపి పెద్దలు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్ని బలహీనంగా తయారు కావ డంతో రాష్ట్రంలో కమలం పార్టీని విస్తరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా టిఆర్‌ఎస్‌పై విమర్శల దాడిని పెంచారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచాయని, ఈ రెండేళ్లలో తెలంగాణ అభివృద్ది కోసం 96 వేల కోట్ల రూపాయల నిధులను కెటాయించామని బిజెపి నేతలు అంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ సర్కార్ దుర్వినియోగం చేస్తుందని తమ ప్రభుత్వ డబ్బులను పేదలకు అందకుండా చేస్తున్నారని వారు ఆరోపించారు. అదే సందర్బంలో టిఆర్‌ఎస్ రెండేళ్ల పాలనపైన ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు. ఎంఐఎం నేతల అరాచకాలకు టిఆర్‌ఎస్ నేతల వంత పాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో బిజెపి పాలనలో రాషా్టల్రు అభి వృద్దిలో దూసుకుపోతున్నాయని, మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ మాత్రం రోజు రోజుకు దిగజారుతుందన్నారు. ఇంత తీవ్ర స్థాయిలో బిజెపి నేతలు టిఆర్‌ఎస్‌పై విరుచుకుపడడంతో టిఆర్‌ఎస్ నేతలు స్పందించారు.
కెసిఆర్ పాలనపై ఆరోపణలు గుప్పిస్తున్న బిజెపి నేతలు...
తెలంగాణలో టిఆర్‌ఎస్ పాలనపై స్థానిక బిజెపి నేతలు గత కొద్దిరోజులుగా పోరాటాలు కొనసాగిస్తున్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడంతో పాటు రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆ పార్టీ నేతలు ఆందోళనల బాట పట్టారు.కరువు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోను నిరసన ర్యాలీలు చేపట్టారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ సహ పలు అంశాలపై ప్రభుత్వ తీరును బిజెపి నేతలు తప్పుబడుతున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి సంబందించి రాష్ట్రంలో లక్ష ఇళ్లు నిర్మించేందుకు సిద్దమైన కేంద్రం ఒక్కో ఇంటికి లక్ష రూపాయల సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం నిర్ణ యిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇళ్ల నిర్మాణాలను చేపట్టకుండా అడ్డు కుంటోం దని ఆరోపిస్తున్నారు. కేంద్రం చేపట్టిన పలు పథకాలలో తెలంగాణ పట్టణాలకు చోటు దక్కిందని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిజెపి మద్దతుతోనే జరిగిందంటున్న బిజెపి నేతలు రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కోలు కునే పరిస్థితులలో లేదని టిఆర్‌ఎస్ ప్రత్యామ్నాయంగా బిజెపిని తీర్చి దిద్దేం దుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రజా ఉద్యమాల బాట పట్టారు.
బిజెపి నేత
ల ఆరోపణలను తిప్పికొడుతున్న రాష్ట్ర మంత్రులు
టిఆర్‌ఎస్ సర్కార్‌పై బిజెపి నేతలు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర మంత్రులు తిప్పికొడుతున్నారు. తెలంగాణ నూతనంగా ఏర్పడిన రాష్టమ్రని చెబుతూనే రాషా్టభ్రివృద్దికి కేంద్రం సహాయం చేయడం లేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన పలు పథకాలను నరేంద్ర మోఢీ మెచ్చుకున్నారని చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణలోని ఏడు మండలాలలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్ల సీలేరు నుండే వచ్చే నాలుగు వందల యాబై యూనిట్ల విద్యుత్‌ను తెలంగాణ కోల్పోయిందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికి ఇప్పటికి హై కోర్టు విభజన పూర్తి చేయ లేదని గుర్తు చేస్తున్నారు. ఉద్యోగుల విభజనతో పాటు రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదన్నారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారమే కేంద్రం నుండి అన్ని రాషా్టల్రకు ఇచ్చిన విదంగానే తెలంగాణకు కూడ ఇచ్చారని ప్రత్యేకంగా ఇచ్చినవి ఏమి లేదని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో పేర్కొన్న విదంగా ఏయిమ్‌సతో పాటు పలు విద్యాలయాలను ప్రకటించడంలో కేంద్రం ఆలస్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు తాము కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అలసత్వం పై ప్రశ్నిస్తుంటే తప్పుడు సమాధానాలు చెబుతూ బిజెపి నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తురని మండిపడ్డారు. విభజన చట్టంలో పేర్కొన్న హమీల అమలు కోసం తాము మరో ఉద్యమానికి సిద్దమవుతామని తెలంగాణ మంత్రులు హెచ్చరించారు. ఓ వైపు బిజెపి నేతలు మరో వైపు తెలంగాణ మంత్రులు చేస్తున్న వాదోపవాదాలతో రెండు పార్టీల మద్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మద్య సఖ్యత చెడిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa