హైదరాబాద్, మేజర్‌న్యూస్‌ః తెలంగాణ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున బోగస్ కంపెనీలు పెద్దఎత్తున ప్రచారం చేసుకొని వేలాది మంది నిరుద్యోగులను మో సం చేస్తుంటే ప్రభుత్వం ఏమి చేస్తోందని, మంత్రి కేటీఆర్‌కు ఐటి కంపెనీలతో సెల్ఫీలు దిగడంపై ఉన్న శ్రద్ద నిరుద్యోగల సమస్యలపై లేదా అని తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్‌లు ప్రశ్నించారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదివారం ఉప్ప ల్ లిటిల్ ఫ్లవర్ కళాశాల ప్రాంగణంలో టెట్ మై.జాబ్ కంపెనీ పేరుతో నిరుద్యోగులకు పెద్దఎత్తున ఉద్యోగాలు అని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని 25 అంతర్జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయని ప్రచారం చేసి, నిరుద్యోగుల నుంచి రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులు వసూలు చేసి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకుంగా మోసం చేశారని వారు ఆరోపించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువతకు ప్రభుత్వం మోసం చేసిందని నిరుద్యోగుల ఆశలను ఆసరా చేసుకుని మోసం చేస్తున్నారన్న విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa