ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధికి అడ్డుపడుతున్న జగన్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 01:52 AM

అనంతపురం నుంచి  సూర్య ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ప్రతిపక్ష నేత జగన్‌ను ప్రజలు ఛీ కొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఏపీ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు. మంత్రులు డాక్టర్‌ పల్లె రఘునాథ్‌ రెడ్డి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే పార్థ సారథి  టీడీపీ మద్దతు తెలిపిన  పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధులు కేజే. రెడ్డి, బచ్చల పుల్లయ్య   ఎన్నికలపై స్థానిక ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో  సోమవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణమండపంలో నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల తో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  మంత్రులు డాక్టర్‌ పల్లె రఘునాథ్‌ రెడ్డి, కొల్లు రవీంద్ర పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పార్థసారథి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కే.జే రెడ్డి హాజరయ్యారు . ఈ సందర్భంగా  మంత్రి డాక్టర్‌ పల్లె రఘునాథ్‌ రెడ్డి మాట్లాడుతూ రూ.692 కోట్లు పంటనష్టపరిహారం రాషా్టన్రికి వస్తే, అనంతపురం జిల్లాకు రూ.567 కోట్లు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదన్నారు. ఈ ఏడాదిలో వేరుశనగ పంట దెబ్బ తిన్న రైతాంగానికి రాషా్టన్రికి ఇన్సూరెన్‌‌స కింద రూ.434 కోట్లు వస్తే, అనంతపురం జిల్లా కు రూ.368 కోట్లు మంజూరు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుం దన్నారు. పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. చిలమత్తూరు మం డలం కోడికొండ వద్ద రాగమయూరి ఎల క్ట్రానిక్‌ ఎల్సీనా పార్‌‌క ను ఏర్పాటు చేసి జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి కల్పించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 3లక్షల 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, ఈ మధ్య విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో రాషా్టన్రికి రూ.10 లక్షల 50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అందులో 22 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని చెప్పారు. జగన్‌ లాంటి కుట్రలు, కుతంత్రాలు కలిగిన ప్రతి పక్షనేత రాషా్టన్రికి ఉండడం దురదృష్టకరమన్నారు అనంతరం అనంతపురం పీవీకేకే కాలేజీలో ఏపీయూడబ్లూ్యజే-2017 డైరీని   ఐటీ, సమాచార, పౌర సంబం ధాల శాఖ మంత్రి డాక్టర్‌ పల్లె రఘునాథ్‌ రెడ్డి ఆవిష్కరించారు.  జర్నలిస్టుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. జర్నలిస్టులకు హెల్‌‌త కార్డులు, రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్‌‌స సౌకర్యం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదని, జర్నలిస్టుల అభ్యున్నతికి ముఖ్య మంత్రి చంద్రబాబు కట్టుబడి ఉన్నారని అన్నారు. అనంతపురం కమలానగర్‌లో హోటల్‌ పసుపుల గ్రాండ్‌ను  మంత్రులు డాక్టర్‌ పల్లె రఘునాథ్‌ రెడ్డి, పరిటాల సునీత, జడ్పీ చైర్మన్‌ చమన్‌, ఎమ్మెల్సీ శమంతక మణి  ప్రారంభించారు.  










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa