-సహజ మరణం పొందిన శివశంకర్
-నివాళులు అర్పించిన కేసీఆర్
-సంతాపం తెలిపిన ప్రముఖులు
హైదరాబాద్, సూర్యప్రతినిధి : బడుగుల నేత పి.శివశం కర్ కన్నుమూశారు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. న్యాయమూర్తిగా ఏడాదిపాటు పనిచేసిన ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే సికింద్రబాద్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోమ వారం మధ్యాహ్నం కన్నుమూశారు. జూబ్లీహిల్‌స రోడ్ నం బర్ 52లోని స్వగృహంలో శివశంకర్ పార్థీవదేహాన్ని రాజ కీయనేతలు, బడుగు, బలహీనవర్గాల నేతలు సందర్శించి నివాళ్లర్పించారు. శివశంకర్ 1929 ఆగస్టు 10న హైదరా బాద్ జిల్లా మామిడిపల్లిలో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. బీసీల అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం పనిచేశారు. ఎక్కడ సమావేశాలు, సదస్సులు నిర్వహించినా పెద్దసంఖ్యలో బీసీలు వచ్చి ఆయనకు ఘనస్వాగతం పలికేవారు. అమృత్‌సర్ హిందూ కాలేజీలో బీఏ పట్టభద్రులయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 1974-75లో న్యాయమూర్తిగా పనిచేశారు. 1979 సంవత్సరంలో జరిగిన ఆరో లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1980లో నిర్వహించిన రీ ఎలక్షన్‌లో తిరిగి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1985, 1993 సంవత్సరాల్లో గుజరాత్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రెండోసారి విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1987-88 సంవత్సరంలో ప్లానింగ్ కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. శివశంకర్ మృతికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు పలువురు సంతాపాన్ని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa