ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాచీన కట్టడాల పరిరక్షణకు టాస్‌‌కఫోర్‌‌స

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 02:10 AM

హైదరాబాద్‌, సూర్యప్రతినిధి: నగరం లోని ప్రాచీన కట్టడాల పరిరక్షణపై మంత్రి కల్వకంట్ల తారకరామారావు  సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి పుర పాలక పురావస్తు, పర్యాటక సాంస్కృతిక శాఖ అధికారులు, ఆగాఖాన్‌ ట్రస్టు సభ్యులు హాజరయ్యారు. చారిత్రక కట్ట డాల వద్ద కబ్జాలు అరికట్టేందుకు అక్రమ భవనాలు తొలగించేందుకు ప్రత్యేక టా„స్‌‌క ఫోర్‌‌స ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కట్టడం ప్రాంతాన్ని జియో ట్యాగింగ్‌, జియో ఫెన్సింగ్‌ చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చారిత్రక కట్టడాలు, ప్రదేశాలతో ప్రత్యేక యాప్‌ తయారు చేయాలన్నారు. చార్మినార్‌, గోల్కొండ, కుత్‌బ్‌షాహీ సమాధులకు యునెస్కో హోదా కోసం యత్నిస్తున్నామని మంత్రి తెలిపారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa