- ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
-శివశంకర్ మృతిపట్ల గవర్నర్ సంతాపం
-రాష్ట్రానికి తీరని లోటు : డాక్టర్ కె.లక్ష్మణ్
హైదరాబాద్, సూర్యప్రధానప్రతినిధి: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌నాయకుడు పి. శివశంకర్ భౌతికకాయానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు త్రీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మరణవార్త విన్న వెంటనే సీఎం శివశంకర్ ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివశంకర్ కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతి తెలిపారు. కేంద్ర మంత్రిగా, న్యాయమూర్తిగా, గవర్నర్‌గా, బీసీ నాయకుడిగా శివశంకర్ ప్రజలకు ఎన్నో సేవలందించారని సీఎం స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవం తుడిని ప్రార్థించారు. కేంద్ర మంత్రిగా, గవర్నర్‌గా, న్యాయమూర్తిగా సేవల బించిన తెలంగాణ బిడ్డ శివశంకర్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్పీసింగ్‌ను ఆదేశించారు. ఇందుకుగు అన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం ఆదేశించారు.
శివశంకర్ భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. శివశంకర్ అంత్యక్రియలు మంగళవారం ఉదయం జరగనున్నాయి. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివశంకర్ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
శివశంకర్ మృతిపట్ల గవర్నర్ సంతాపం : మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ మృతిపట్ల గవర్నర్ నరసింహన్ సంతాపం ప్రకటించారు. కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా శివశంకర్ చేసిన సేవలను గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా శివశంకర్ కుటుంబ సభ్యులకు గవర్నర్ సానుభూతి తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు. జూబ్లీహిల్‌స రోడ్ నంబర్ 52లోని స్వగృహంలో శివశంకర్ పార్థివదేహాన్ని ఉంచారు. శివశంకర్ 1929 ఆగస్టు 10న హైదరాబాద్ జిల్లా మామిడిపల్లిలో జన్మించారు. అమృత్‌సర్ హిందూ కాలేజీలో బీఏ పట్టభద్రు లయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా అందు కున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 1974-75లో న్యాయమూర్తిగా పనిచే శారు. 1979 సంవత్సరంలో జరిగిన ఆరో లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1980లో నిర్వహించిన రీ ఎలక్షన్‌లో తిరిగి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1985, 1993 సంవత్సరాల్లో గుజరాత్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రెండోసారి విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1987-88 సంవత్సరంలో ప్లానింగ్ కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు.
శివశంకర్ మృతికి సి.రామచంద్రయ్య సంతాపం : కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శివశంకర్ మృతి పట్ల శాసన మండలి ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య సంతాపం తెలిపారు. వారికుటుంబ సభ్యులకు ప్రగాఢ సాకూభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రామచంద్రయ్య అక్షాంక్షించారు.
శివశంకర్ మృతిపట్ల వై.ఎస్.జగన్ సంతాపం : కేంద్ర మాజీమంత్రి పి.శివశంకర్ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వై.ఎస్.జగన్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శివశంకర్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఇదిలావుంటే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివశంకర్ సోమవారం తన నివాసంలో మరణించిన విషయం తెలిసిందే. శివశంకర్ కేంద్రమంత్రితో పాటు, సిక్కిం గవర్నర్‌గా కూడా పనిచేశారు
శివశంకర్ మృతి.. రాషా్టన్రికి తీరని లోటు డాక్టర్ కె.లక్ష్మణ్ : మాజీ గవర్నర్ పి.శివశంకర్ మరణించారన్న వార్త తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శివశంకర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అని, న్యాయశాస్త్ర కోవిదుడు, జాతీయ స్థాయిలో పేరుపొందిన ఆయన మరణం రాషా్టన్రికి తీరని లోటన్నారు. శివశంకర్ మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలయజేస్తూ ...ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నట్లు లక్ష్మణ్ తెలిపారు.
శివశంకర్ మృతి పట్ల టీపీసీసీ సంతాపం : కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్ మృతి పట్ల తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రగాఢ సంతాపం ప్రకటించింది. తెలంగాణ సమాజం ఒక మంచి బిసి నేతను కోల్పోయిందని, ఒక మేధావిగా, రాజకీయ విజ్ఞత ఉన్న నేతగా ఆయన దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శివశంకర్ మరణించిన వార్త తెలియగానే కాంగ్రెస్ నేతలు నర్సింహారెడ్డి, కోదండరెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పార్టీ తరపున సంతాపం ప్రకటించారు. కాగా.. ఈ విషయమై వారు మాట్లాడుతూ న్యాయమూర్తిగా, పార్లమెంట్ సభ్యునిగా, కేంద్రమంత్రిగా, కేరళ, సిక్కిం గవర్నర్‌గా పలు హోదాలలో ఆయన పని చేశారని వారు గుర్తు చేశారు. శివశంకర్ ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు.
శివశంకర్ మృతి పట్ల టీటీడీపీ సంతాపం : కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ ఆకస్మిక మృతిపట్ల తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. కేంద్రమంత్రిగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కేరళ, సిక్కిం రాషా్టల్రకు గవర్నర్‌గా పనిచేసిన ఘనత ఆయది అని నఅ్నరు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa