ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా పర్యటనలో భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 12:27 PM

భారత విదేశాంగ కార్యదర్శి ఎస్‌. జైశంకర్‌ అమెరికాలో పర్యటిస్తున్నారు. హెచ్‌1బీ వీసాల జారీలో మార్పులు, అమెరికాలోని భారతీయుల భద్రత తదితర అంశాలపై ట్రంప్‌ పరిపాలన వర్గంలోని సీనియర్‌ అధికారులతో ఆయన చర్చించే అవకాశముంది. కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా ద్వైపాక్షిక చర్చల్లో దృష్టిసారించనున్నట్లు సీనియర్‌ అధికారులు తెలిపారు. అమెరికా చట్టసభ సభ్యులు, ట్రంప్‌ పరిపాలన వర్గంతో కేంద్రం తరచూ సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. హెచ్‌1బీ వీసాలపై తమ ఆందోళనను ఇప్పటికే తెలియజేసినట్లు పేర్కొన్నారు. కేన్సస్‌లో తెలుగు ఇంజినీర్‌ శ్రీనివాస్‌ కూచిభొట్ల హత్యకుగురైన నేపథ్యంలో.. భారతీయులు వివక్షకు గురికాకుండా చూడటంపై జైశంకర్‌ చర్చించే అవకాశముందని వివరించారు. నాలుగు రోజుల పాటు శంకర్ పర్యటన కొనసాగనుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa