అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొత్త వలస విధానానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై బుధవారం సంతకం చేయనున్నారు. అమెరికా కాంగ్రెస్‌లోని చట్టప్రతినిధులతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించిన మరుసటి రోజు ఆయన సంతకం చేయనున్నట్లు శ్వేతసౌదం వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ ఆదేశాలపై ట్రంప్ గతవారంలోనే సంతకం చేయాలని అనుకున్నారు. అయితే కొత్త ఆర్డర్లలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తగా చూసుకునేందుకే ఆయన ఈ వారం వరకు కావాలని నిలిపి ఉంచినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa