ప్రఖ్యాత వ్యాపారవేత్త, బిలియనీర్ వారెన్ బఫెట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హాట్ కామెంట్స్ చేశారు. అమెరికాలో ఇతర దేశస్థులపై జరుగుతున్న దాడులపైనా బఫెట్ స్పందించారు. తన కంపెనీ బెర్క్‌షైర్ హాత్‌వే వాటాదారులకు రాసిన వార్షిక లేఖలో ఇతర దేశాల నుంచి అమెరికాకు వలసల వల్ల ప్రయోజనమే తప్ప ఎటువంటి నష్టం లేదని స్పష్టంగా తన అభిప్రాయం వెల్లడించారు. ప్రతిభ, పట్టుదలకు ప్రతీకగా వలసదారులను ఆయన అభివర్ణించారు. అమెరికన్ల తెలివితేటలతో పాటు మార్కెట్ విధానం, పటిష్ట న్యాయ వ్యవస్థ, ప్రతిభ, పట్టుదల కలిగిన వలసదారుల కలయిక వల్ల మన ముందు తరాల వారు కన్న కలల కంటే మిన్నగా అభివృద్ధి సాధించామని బఫెట్ తన లేఖలో పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ వలసదారులపై కత్తిగట్టినట్లు వ్యవహరిస్తున్న నేపథ్యంలో బఫెట్ లేఖ ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ విధానాలపై మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ప్రఖ్యాత సంస్థల సారధులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa