ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవికి 151వ చిత్రంలో జోడీగా శృతిహాసన్...!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 12:43 PM

ఖైదీ నంబర్ 150తో చిరంజీవి సినిమాల్లోకి పునరాగమనం చేశారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చక్కటి వసూళ్లను సాధించింది. తాజాగా ఆయన 151వ చిత్రానికి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా శృతిహాసన్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత అనుష్కకు ఈ అవకాశం దక్కినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆమె స్థానంలో చివరకు శృతిహాసన్‌ను కథానాయికగా తీసుకున్నట్లు తెలిసింది. గతంలో మెగా హీరోలు రామ్‌చరణ్‌తో ఎవడు, పవన్‌కల్యాణ్‌తో గబ్బర్‌సింగ్, అల్లు అర్జున్‌తో రేసుగుర్రం చిత్రాల్లో శృతిహాసన్ కథానాయికగా నటించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa