ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో భారతీయులపై దాడిని ఖండించిన హిల్లరి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 02:59 PM

అమెరికాలో భారతీయులపై జరిగిన జాత్యహంకార దాడిపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించాలన్నారు అమెరికా విదేశాంగశాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్. కాన్సస్ బార్ లో ఇద్దరు తెలుగు యువకులు శ్రీనివాస్, అలోక్ పై జరిగిన దాడిలో, శ్రీనివాస్ కూచిబొట్ల మరణించారు. దీనిపై స్పందించిన హిల్లరీ, మృతుడు శ్రీనివాస్ భార్య సునయన వీడియోను ట్వీట్ చేశారు. జాతి వివక్ష దాడులు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అటు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడ్డ మరో అభ్యర్ధి బెర్నీ శాండర్స్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇలాంటి దాడులకు వ్యతిరేకంగా ట్రంప్ స్పందించాలని, తన ఎజెండాకు వ్యతిరేకంగా దాడులు జరిగినప్పుడు మాత్రమే స్పందించడం కాకుండా, ఇలాంటి ఘటనలను కూడా ఖండించాలన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa