హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం పనుల్లో జాప్యంపై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల వేగం పెంచాలని సంబంధిత అధికారులకు కడియం ఆదేశాలు జారీ చేశారు. 2018 డిసెంబర్ 6 నాటికి 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు కడియం శ్రీహరి. స్మృతివనం నిర్మాణం కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. విగ్రహ నమూనా ఇంకా సిద్ధం చేయకపోవడంపై డిప్యూటీ సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు నాటికి విగ్రహ నమూనా తయారీ సంస్థను ఖరారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్‌లో గ్లోబల్ టెండర్లు పిలవాలని సూచించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa