హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 8 ప్రొను గత వారం కిందట విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఫోన్ ఇప్పటి వరకు కేవలం అమెజాన్ సైట్‌లో ఫ్లాష్ సేల్‌లో మాత్రమే లభించింది. అయితే రేపటి నుంచి ఈ ఫోన్‌ను యూజర్లు నేరుగా ఓపెన్ సేల్‌లోనే కొనుగోలు చేయవచ్చు. అదే అమెజాన్ సైట్‌లో ఈ ఫోన్ ప్రత్యేకంగా ఓపెన్ సేల్‌లో లభిస్తున్నది. రూ.29,999 ధరకు ఈ ఫోన్‌ను యూజర్లు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను కొన్న యూజర్లకు వొడాఫోన్ ఆఫర్‌ను అందిస్తున్నది. యూజర్లకు 5 నెలల వాలిడిటీతో 45 జీబీ 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఈ నెల 31వ తేదీ లోపు కొన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa