ధాన్యం సేకరణలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ రికార్డు సృష్టించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రైతుల నుంచి 53 లక్షల 66 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. గత రికార్డుకన్నా ఇది 216 శాతం అధికం. 2013-14లో 3 వేల 285 కొనుగోలు కేంద్రాల ద్వారా 24 లక్షల 82 వేల టన్నుల ధాన్యాన్ని కొన్నారు. అదే ఇప్పటివరకు రికార్డు. ఈ ఏడాది దానికన్నా రెండు రెట్లకుపైగా ఎక్కువ ధాన్యాన్ని సేకరించారు. ఈ ఏడాది వానాకాలం, యాసంగిలో 5 వేల 231 కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం 10 లక్షల 93 వేల 196 మంది రైతుల నుంచి 53 లక్షల 66 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ ఏడాది వానాకాలంలో 2 వేల 178 కొనుగోలు కేంద్రాల ద్వారా 4 లక్షల 176 మంది రైతుల నుంచి 16 లక్షల 52 వేల టన్నుల ధాన్యాన్ని 2 వేల 479 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. యాసంగిలో 6 లక్షల 93 వేల 20 మంది రైతుల నుంచి 37 లక్షల 14 వేల టన్నుల ధాన్యాన్ని 5 వేల 627 కోట్లు వెచ్చించి సేకరించారు. దీనికోసం 9 కోట్ల 25 లక్షల గోనెసంచులను సమకూర్చారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు వెయ్యి 510, సాధారణ రకానికి వెయ్యి 470 రూపాయలు చెల్లించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa