దక్షిణ బ్రెజిల్‌లోని పల్‌హోకా, ఫ్లోరియాపోలిస్ ప్రాంతంలో జూలై 7వ తేదీన ఓ పెద్ద బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. కొంతదూరం వెళ్లాక బస్సు నుంచి శబ్ధాలు రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు. వింత శబ్ధాలు రావడంతో ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే పక్కకు జరిగారు. అదే సమయంలో పెద్దశబ్ధం చేస్తూ ఆ పెద్దబస్సు రెండుగా చీలిపోయింది. బస్సులోని ఓ ప్యాసింజర్ ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా కూడా జరుగుతుందా అని కొందరు కామెంట్ చేయగా, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగనందుకు సంతోషమంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa