నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టీ న్యూస్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. మొక్కలు నాటడంతోపాటు మిషన్ కాకతీయ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ శ్రేణులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అటవీశాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని.. ప్రతీ ఒక్కరు తప్పకుండా మొక్కలు నాటాలని మంత్రులు చెప్పారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa