హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కవిత ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. నగరంలోని సురభి ఎడ్యూకేషనల్ సోసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఎంపీ కవిత ఇవాళ రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్ ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపునేని రాజకూమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కళాకారులకు నిలయమన్నారు. కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వెల్లడించారు. పూర్వ విద్యార్థుల స్ఫూర్తితో ఫైన్ ఆర్ట్స్ కళాకారులు మరింత ముందుకెళ్లాలని సూచించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa