ఈ నెల 16 నుంచి 27 వరకు సెలవుపై వెళ్తున్నానని ఎక్సైజ్ డీజీ అకున్ సబర్వాల్ తెలిపారు. వ్యక్తిగత పనులపై సెలవుపై వెళుతున్నానని వెల్లడించారు. కేసు దర్యాప్తుకు, నా సెలవుకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేశాం. మరో 12 మందికి నోటీసులు ఇచ్చాం. సినీరంగ వ్యక్తులు, విద్యాసంస్థల పేర్లు బయటపెట్టలేదు. మాపై ఎవరి ఒత్తిడీ లేదని తేల్చి చెప్పారు.