ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిలయన్స్ జియో సంచలన నిర్ణయం!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 04:38 PM

భారతీయ టెలికాం రంగంలో మరో విప్లవాత్మక మార్పుకు రిలయన్స్ జియో శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. 4జీ ఎల్టీఈ కంటే గొప్ప అనుభూతిని పరిచయం చేసేందుకు రిలయన్స్ జియో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తొలిసారిగా 5జీ సేవలను ప్రారంభించబోతున్నట్లు జియో ప్రకటించింది. 5జీ సేవలను మరింత మెరుగ్గా అందించడం కోసం రిలయన్స్ జియో స్యామ్‌సంగ్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ విషయాన్ని స్పెయిన్‌లోని బార్సిలోనియాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో అధికారికంగా ప్రకటించారు. 


రిలయన్స్ జియో 5జీ తాలూకు ఉత్పత్తులను ఈ కాన్ఫరెన్స్‌లో ఆవిష్కరించింది. దక్షిణ కొరియాకు చెందిన ఓ టెక్నాలజీ సంస్థ రిలయన్స్ జియో పరిచయం చేసిన 5జీ డివైజ్‌లను తయారుచేసింది. స్యామ్‌సంగ్ కంపెనీ కూడా తన కొత్త 5జీ ఉత్పత్తులను ఈ మీట్‌లో ఆవిష్కరించింది. 5జీ హోమ్ రూటర్, 5జీ రేడియో బేస్ స్టేషన్, 5జీ మోడెమ్ చిప్‌సెట్స్‌ను స్యామ్‌సంగ్ రూపొందించింది. స్యామ్‌సంగ్, రిలయన్స్ జియో భాగస్వామ్యంతో త్వరలో ఇండియాలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జియో ప్రైమ్ మెంబర్‌షిప్ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. రిలయన్స్ జియో పూర్తి స్థాయిలో ప్రజలకు మెరుగైన నెట్‌వర్క్‌ను అందించిన తర్వాత 5జీ సేవలపై కసరత్తు చేయనుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa