హైదరాబాద్‌లోని పేరున్న విద్యా సంస్థలతోపాటు టాలీవుడ్‌ని కుదిపేస్తోన్న డ్రగ్స్ రాకెట్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. డ్రగ్స్ రాకెట్ కేసులో విచారణ వేగవంతం చేసిన హైదరాబాద్ సిట్ పోలీసులు శుక్రవారం బంజారాహిల్స్‌లో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పీయుష్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి 40 గ్రాముల కొకైన్, 2,746 ఎల్ఎస్డీ యూనిట్స్, 20 గ్రాముల గంజాయి, 150 మత్తు మాత్రలు స్వాధీనం చేసుకున్నారు.
పీయుల్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడి కాల్ డేటా ఆధారంగా ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేసి వుంటాడనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.