హైదరాబాద్ : మాదకద్రవ్యాల కేసులో నిందితుడు కెల్విన్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు కెల్విన్‌ను రెండు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ శుక్రవారం సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల పాటు కస్టడీలోకి ఇవ్వాలని పోలీసులు కోరినప్పటికీ కోర్టు మాత్రం రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నెల 3 నుంచి జైలులో ఉంటున్న కెల్విన్‌ను ఈ ఉదయం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి నిందితున్ని మళ్లీ రిమాండ్‌కు తరలించనున్నారు.