ముంబయి: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తెలంగాణ క్రీడల మంత్రి పద్మారావుకు ధన్యవాదాలు తెలిపారు. కొద్ది రోజుల క్రితం జ్వాలను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) డబుల్స్ కోచ్గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె మంత్రి పద్మారావును సచివాలయంలో కలిసి హైదరాబాద్లో బ్యాడ్మింటన్ అభివృద్ధిపై చర్చించారు. ఎల్బీ స్టేడియంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా జ్వాల మంత్రిని కోరారు.
జ్వాల వినతికి స్పందించిన మంత్రి ఎల్బీ స్టేడియంలో అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు చేపట్టారు. పనులు జరుగుతోన్న ఫొటోలను జ్వాల తన ట్విటర్ ద్వారా పంచుకుని మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేస్తానని జ్వాల తెలిపారు.