హైదరాబాద్: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ శనివారం సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిశారు. జిల్లా కలెక్టర్ ప్రీతిమీనాతో వివాదం అనంతరం తొలిసారి సచివాలయానికి వచ్చిన నాయక్.. కడియంతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా కడియంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలిశారు. ముత్తిరెడ్డిపై కూడా ఐఏఎస్ అధికారులు నిన్న సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎస్‌ను కలిశారు.