గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర శనివారం పుంజుకుంది. 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.190 పెరిగి రూ.29వేల మార్కుకు చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండటం ధర పెరగడానికి కారణమైందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. దీంతో శనివారం నాటి ట్రేడింగ్‌లో రూ.29,050కు చేరింది.
మరోవైపు వెండి కూడా రూ.38వేల మార్కును దాటింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఏర్పడటంతో వెండి ధర తిరిగి బలం పుంజుకుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా బంగారం ధర 0.91శాతం పెరిగి ఔన్సు 1,228.40 డాలర్లకు చేరింది.