హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారు జామునుంచే అమ్మవారి దర్శనం కోసం తరలివస్తున్నారు. అమ్మవారికి ఎంపీ కవిత బంగారు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ ప్రజలను చల్లగా చూడాలని వేడుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్లు ఎంపీ కవిత తెలిపారు.అటు రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోందన్నారు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు. బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించామన్న ఆయన.. అన్నివర్గాల పండుగలను వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.