మహబూబ్‌నగర్ : జడ్చర్ల నియోజకవర్గంలోని రాజపూర్ నుంచి కుత్నేపల్లికి రూ. 10 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ మంత్రి మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రోడ్లకు మహర్దశ వచ్చిందని చెప్పారు. గతంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన రోడ్లు సీఎం కేసీఆర్ చొరవతో అద్దంలా మారుతున్నాయన్నారు. రోడ్లు, రవాణా సదుపాయాలు ప్రగతి పథానికి సూచికలు అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కోట్లాది రూపాయాలను ప్రభుత్వం రోడ్ల కోసం వెచ్చిస్తున్నదని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్లు మెరుగుపడ్డాయన్న మంత్రి.. జడ్చర్ల నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాలకు రోడ్లు వచ్చాయన్నారు.