హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతలో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఒడిశా తీరాలను ఆనుకొని అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. మత్య్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.