హైదరాబాద్ : రేపటి నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు డ్రగ్స్ కేసులో సినీ పరిశ్రమలో నోటీసులందుకున్న సినీ ప్రముఖులను విచారించనున్నట్లు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఈ విచారణకు రోజుకొకరు మాత్రమే హాజరవుతారని, ముమైత్‌ఖాన్ మినహా మిగతావారంతా విచారణకు హాజరవుతామని చెప్పినట్లు అకున్ పేర్కొన్నారు. ముమైత్‌ఖాన్ బిగ్‌బాస్ షోలో ఉన్న కారణంగా విచారణ తేదీని ఇంకా నిర్ణయించలేదన్నారు. కొత్తగా ఇంకా ఎవరికీ నోటీసులివ్వలేదని అకున్ వెల్లడించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa