హైదరాబాద్: దూలపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కెమికల్ గోడౌన్‌లో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో సమీపంలోని మరో గోడౌన్‌కు మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం కారణంగా గోడౌన్‌లో ఉన్న కెమికల్ డ్రమ్ములు ఎగిరిపడుతున్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుంది. రెండు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa