హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఏఎన్‌ఎంలకు గర్భిణీలు, బాలింతలు, పిల్లల ఆరోగ్య వివరాల నమోదు కోసం ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఎప్పటికపుడు వారి వివరాలు ట్యాబ్‌లో నమోదు చేయాలని మంత్రి ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనవసర ఆపరేషన్లు చేసే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఆస్పత్రి ప్రతి నెలా..శస్త్రచికిత్సల నివేదికలను ప్రభుత్వానికి పంపాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 500 లేబర్ రూములు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa