ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మణుగూరులో 100 పడకల ఆస్పత్రి ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 24, 2017, 02:04 PM

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని మణుగూరులో 100 పడకల ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు ఐటీడీఏలో నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన సమీక్షలో మంత్రి లక్ష్మా రెడ్డి పాల్గొని.. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధిపై చర్చించారు. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన హరితహారంలో మంత్రులు మొక్కలు నాటారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa