ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 24, 2017, 04:24 PM

 హైదరాబాద్ : జవహర్‌నగర్‌లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు నైజీరియన్లతో పాటు విజయవాడకు చెందిన యువతిని అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ ముఠా.. డ్రగ్స్ విక్రయంతో పాటు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 20 గ్రాముల కొకైన్, 12 గ్రాముల బ్రౌన్ షుగర్, ఇతర మత్తు పదార్థాలు, రూ. 2.04 లక్షల నగదు, 3 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa