ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరవళ్లు తొక్కుతున్న కృష్ణ నది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 25, 2017, 04:22 PM

కర్ణాటకలో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి.  ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 88.94 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఆల్మట్టిలోకి 1,42,325 క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నది. ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతుండటంతో దిగువకు 33వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టులోకి 35,740 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.646 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 29.88 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో వర్షాలు పుష్కలంగా పడుతుండటంతో ప్రాజెక్టులకు వరదనీరు భారీగా చేరుతున్నది. ప్రధానంగా మహారాష్ట్రలోని మహబలేశ్వరం ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పెరిగింది. ఇక్కడి ప్రధాన ప్రాజెక్టు కోయినా డ్యామ్‌తో సహా పలు చిన్న ప్రాజెక్టులన్నీ నిండాయి. దిగువన నారాయణపూర్  పక్కనే ఉన్న మరో పెద్ద ప్రాజెక్టు అయిన ఉజ్జయినీ డ్యాంలోనూ నీరు పుష్కలంగా చేరడంతో వరదనీరు దిగువకు వదులుతున్నారు. అదే క్రమంలో ఆల్మట్టి నుంచి నారాయణపూర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్ మట్టీ డ్యాంకు 1.42 లక్షల క్యూసెక్కుల ఇన్  ఫ్లో కొనసాగుతుంది. ఈ లెక్కన ఒక్క రోజుకు ఆల్మట్టి డ్యాంలో 10నుంచి 12టీఎంసీల నీరు వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం ఈ రెండు పెద్ద ప్రధాన ప్రాజెక్టులు నీటికళ సంతరించుకోవడంతో దిగువన జూరాల ఆయకట్టు రైతుల్లో సంబురం నెలకొంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa