ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేర రహిత నగరంగా భాగ్యనగరం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 25, 2017, 04:24 PM

విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లో పోలీసులు తీసుకొచ్చిన సంస్కరణలు మంచి ఫలితాలనిస్తున్నాయి. 2013 లో నగరంలో 19,126 నేరాలు జరుగగా, గత ఏడాదికి రెండు వేలు తగ్గాయి. అదే సమయంలో శిక్షలు 19 శాతం నుంచి 36 శాతానికి పెరిగాయి. నేరాలు తగ్గించడంతో పాటు, నేరస్తులకు శిక్షపడేలా చేయడంలో సిటీ పోలీసు యంత్రాంగం సక్సెస్‌ అవుతోంది. కేసుల దర్యాప్తులో సాంకేతికతను జోడించి పోలీసులు అనుకున్న ఫలితాలు రాబడుతున్నారు. గతంలో కేసు దర్యాప్తు జరిపి, చార్జిషీట్ వేసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ విధానంలో పూర్తిగా మార్పు వచ్చింది. హైదరాబాద్‌ను నేరరహిత సిటీగా తీర్చిద్దేందుకు ప్రభుత్వ ప్రోత్సాహంతో సీపీ మహేందర్‌రెడ్డి ఎన్నో మార్పు లు తీసుకొచ్చారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందినప్పటి నుంచి కోర్టు తీర్పు వచ్చే వరకు ఆయా కేసులపై పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉండేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందుకోసం పోలీస్‌ స్టేషన్లలోని విధులను 14 భాగాలుగా విభజించారు. ఒక్కో విభాగం బాధ్యతలను ఒక్కొక్కరికి అప్పగించారు. నేరస్థులకు శిక్షపడేలా చేయడానికి ప్రత్యేకం గా కోర్టు మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. కేసు దర్యా ప్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విచారణ ఎలా చేయాలి అనే అంశాలపై నమూనాను అందజేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa