ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగరంలో సానియా, నేహా దూపియా సందడి..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 25, 2017, 05:41 PM

హైదరాబాద్ : నగరంలోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో టెన్నిస్‌స్టార్ సానియా మీర్జా, బాలీవుడ్ నటి నేహా దూపియా సందడి చేశారు. ఈ ఇద్దరు సెలబ్రిటీలు వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ టోర్నమెంట్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సానియా, నేహా ఫొటోలను పోజిచ్చారు. ఈ కార్యక్రమంలో సానియా మీర్జా మాట్లాడుతూ అకాడమీ ద్వారా మంచి టెన్నిస్ క్రీడాకారులను ఇవ్వాలన్నది తన ఆకాంక్ష అని తెలిపింది. 


వరల్డ్ టెన్నిస్ టోర్నమెంట్‌కి ఇక్కడి నుంచి క్రీడాకారులు వెళ్తున్నారని, దేశంలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతున్నదని సానియా పేర్కొంది. సానియా ప్రతీ ఆటలో కూడా మహిళలు ముందుకు దూసుకెళ్తున్నారంది. మహిళల ప్రపంచకప్ లో మంచి ప్రదర్శన కనబరిచిన భారత జట్టుకు సానియా అభినందనలు తెలిపింది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa