ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హుస్నాబాద్, ఆసిఫాబాద్‌, బైంసాలకు రైతు బజార్లు..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 25, 2017, 06:05 PM

హైదరాబాద్ : హుస్నాబాద్, ఆసిఫాబాద్, బైంసాలకు రైతు బజార్లు మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. మార్కెటింగ్ శాఖలో సృజనాత్మకమైన విధానాలు అమలు చేయాలని హరీశ్ రావు అధికారులకు నిర్దేశించారు. బీఆర్కే భవన్‌లో మంత్రి హరీశ్‌రావు మార్కెటింగ్ శాఖ, మన కూరగాయల పథకం పనితీరుపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో పత్తి పంట దిగుబడి పెరిగే అంచనాలున్నాయన్నారు. కొనుగోలుకు సంబంధించి మార్కెటింగ్ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ర్టానికి వస్తున్న కూరగాయల దిగుమతులపై అధ్యయనం చేయాలని అధికారులకు నిర్దేశించారు. కూరగాయల ధరల హెచ్చుతగ్గులపై నిరంతరం సమీక్ష చేయాలని, రైతులకు మద్దతు ధర లభించేలా చూడాలన్నారు. కూరగాయల ధరలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. త్వరలో ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తామని హరీశ్‌రావు తెలిపారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa