ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంగన్‌వాడిలకు కెసిఆర్‌ వరాల జల్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 12:35 AM

సూర్యాపేట, కలెక్టరేట్‌, మేజర్‌న్యూస్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 27న హైద్రాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జనహీత కార్యక్రమంలో అంగన్‌వాడి కార్యకర్తతో నిర్వహించిన సమావేశంలో పలు వరాల జల్లు కురిపించారు. కార్యకర్తలను ఉపాద్యాయులుగా పిలువాలని వారికి గౌరవవేతనాని రూ. 7000 నుండి 10500లకు, ఆయాకు 4500నుండి 6500వరకు  జీతాలు పెంచడంతో పాటు అర్హత వున్న వారికి సూపర్‌వైజర్‌గా పదోన్నతులు కల్పిస్తు పలు కీల నిర్ణాలు తీసుకున్నందుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జె ఫంక్షన్‌ హాల్‌నందు అంగన్‌వాడి కార్యకర్తలు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేక్షంచేశారు. ఈఅభినందన సభకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గండూరి ప్రవళికప్రకాశ్‌ ముఖ్యఅతిధిగా పాల్గొన్ని మాట్లాడుతూ ప్రభుత్వం వెల్లవే ళాల కార్యకర్తలకు అండగా ఉంటుందని మంత్రి జగదీష్‌రెడ్డి సహాకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు విడుతలుగా వేతనాలు పెంచారని కేంద్రానికి సన్నబియ్యం ఏఫ్రిల్‌ మాసం నుండి అందించనున్నట్లు ప్రభుత్వ హస్పటల్‌లో ప్రసవమైతే రూ. 12వేలు రూపాయలు అందిస్తారని, నవజాత శిశువుకు రూ. 2వేల రూపాయల కిట్‌ అందిస్తారన్నారు. ఈకార్యక్రమంలో వైస్‌ చైర్‌‌సపర్సన్‌ నేరేళ్ళ లక్ష్మీ, కౌన్సిలర్ల ఆకుల లవకుశ, బాణాల విజయ్‌కుమార్‌, తహేర్‌పాషా, వనజ తదితరులు పాల్గొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa