ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెసిఆర్‌ మోసగాళ్లకే మోసగాడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 12:37 AM

-కవిత కు పోటీ అవుతుందనే రాష్ట్ర మంత్రి వర్గంలో మహిళకు   చోటివ్వని కెసిఆర్‌
-కమీషన్‌ ల కోసమే కాకతీయ, భగీరథ లు
-జాగృతి పేరుతో దోపిడీ కి పాల్పడుతున్న కవిత
-జగిత్యాల వేదికగా జన ఆవేదన సభలో ప్రభుత్వం పై నిప్పులు   చెరిగిన కాంగ్రెస్‌ నాయకులు
-శ్రీధర్‌ బాబు,మధు యాష్కిగౌడ్‌, జీవన్‌రెడ్డి 
కరీంనగర్‌-సూర్యప్రత్యేకప్రతినిధి: తన కూతురు నిజామాబాద్‌ ఎంపి కవిత కు భవిష్యత్తులో పోటీగా మారి రాష్ట్ర రాజకీయాలలో ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉన్నందువల్లే ముఖ్యమంత్రి కెసిఆర్‌  తన మంత్రి వర్గంలో మహిళలకు చోటివ్వడం లేదని కాంగ్రెస్‌ నాయకులు దుద్ధిళ్ళ శ్రీధర్‌ బాబు అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జన ఆవేదన బహిరంగ సభ వేదికగా కాంగ్రెస్‌ నాయకులు ముఖ్యమంత్రి కెసిఆర్‌, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. భవిష్యత్‌లో కవితకు రాష్ట్ర రాజకీయాల్లో ఎదురు ఉండకూడదనే ముఖ్యమంత్రి కెసిఆర్‌ మహిళా శాసనసభ్యులను అణగద్రొక్కుతున్నారన్నారు. ఎంపి కవిత తెలంగాణ మహిళలకు బతుకమ్మ ఆడడం తానే నేర్చించిన్నట్లుగా ఫీలవుతున్నారని శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. జిల్లాకొక డబుల్‌బెడ్‌ రూం ఇళ్ళు నిర్మించి తప్పుడు ప్రచారం చెప్తూ పేద ప్రజలను మభ్యపెడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కాలం వెళ్ళదీస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చాక లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి మూడు సంవత్సరాల కాలంలో కేవలం నాలుగు వేల ఉద్యోగాలను భర్తీ చేశారని అన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న ముఖ్యమంత్రి కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వ లేదని, తన ఇంటికి మాత్రం నాలుగు రాజకీయ పదవులను సాధించుకున్నారని శ్రీధర్‌బాబు వ్యంగాసా్తల్రు సంధించారు. కెసిఆర్‌ మాయలఫకీర్‌ మాటలతో మోసపోయిన తెలంగాణ యువత ముపై్ప నెలల పాలనలో వాస్తవాలను గ్రహించారని రాబోయే రోజుల్లో నిరుద్యోగులు ఉద్యమాల బాట పడుతారని ఆయన అన్నారు. మాజీ ఎంపి మధుయాష్కీగౌడ్‌ మాట్లాడుతూ ఎంపి కవిత జాగృతి పేరుతో ప్రజలను మోసం చేస్తూ దోపిడీలకు పాల్పడుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కమీషన్‌ భగీరథ, కమీషన్‌ కాకతీయ అంటూ కమీషన్‌లు వచ్చే పథకాలను మాత్రమే నిర్వహిస్తుందని అన్నారు. ఆంద్రోళ్ళు మోసగాళ్ళని చెప్పిన కెసిఆర్‌ నేడు వాళ్ళతోనే జట్టుకట్టి తెలంగాణలో దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆంద్రోళ్లు మోసగాళ్లయితే, కెసిఆర్‌ మోసగాళ్ళకే మోసగాడని గాలి జనార్ధన్‌రెడ్డి, విజయ్‌మాల్యాకు పట్టిన గతే కెసిఆర్‌కు పడుతుందని మధుయాష్కీ అన్నారు. తెలంగాణ ప్రజలు మరో సారి మోసపోవడానికి సిద్దంగా లేరని, కల్వకుంట్ల కుటుంబ దోపిడి నుండి, తెలంగాణ రాబందుల సమితి పాలన నుండి తెలంగాణకు విముక్తి కల్పించి కెసిఆర్‌ను రాజకీయంగా బొందపెడుతామని మధుయాష్కీ హెచ్చరించారు. మూడు సంవత్సరాల క్రితం మామూలు కార్లలో తిరిగిన ముఖ్యమంత్రి, కూతురు, కొడుకు, కుటుంబ సభ్యులు నేడు కోట్ల రూపాయల విలువ చేసే కార్లలో ఎలా తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఒక పత్రిక నమస్తే తెలంగాణ కాదని అది నమస్తే కెసిఆర్‌ అని దానితో పాటే తప్పుడు ప్రచారాలను ప్రసారాలు చేస్తున్న వి6, టీ న్యూస్‌ లను తెలంగాణ ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సిఎల్‌పి ఉపనేత జగిత్యాల శాసనసభ్యులు టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో తెలంగాణను అప్పుల ఊబిలోకి దించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనని అన్నారు. 58 యేళ్ళ సమైఖ్యాంద్ర పాలనలో తెలంగాణ „ప్రాంతానికి 60 వేల కోట్ల అప్పు ఏర్పడగా, కేవలం మపై్ప నెలల కెసిఆర్‌ పాలన కాలంలో మరో 60 వేల కోట్ల రూపాయల అప్పును తెలంగాణ ప్రజలనెత్తిన మోపారని జీవన్‌రెడ్డి అరోపించారు. మూడు సంవత్సరాల క్రితం కోదండరామ్‌ను తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని కొనియాడిన కెసిర్‌, నేడు తన పాలనను వ్యతిరేకించిన కోదండరామ్‌ను తెలంగాణ ద్రోహిగా చిత్రిస్తూ తెలంగాణ ప్రజలను, ఉద్యమకారులను అవమానిస్తున్నారని అన్నారు. ఇంటికో పెన్షన్‌ ఇస్తా అన్న కెసిఆర్‌ అత్తకోడళ్ళ వ్యవహారంతో ఇంటికో పంచాయితీ పెట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ నియంతకు మారు పేరుగా మారి పరిపాలన సాగిస్తున్నారని వందల కోట్ల రూపాయలతో బుల్లెట్‌ ప్రూఫ్‌ బాత్రూమ్‌లతో బంగళాలు నిర్మించుకొన్న కెసిఆర్‌, ఇండ్లు లేని నిరుపేదలను డబుల్‌బెడ్‌ రూంల పేరుతో మభ్య పెడుతున్నారని అన్నారు. ఎస్‌సి సబ్‌ప్లాన్‌ నిధుల్లో మంజూరు అయిన వాటిలో దాదాపు పది వేల కోట్ల నిధులను మళ్ళించారని అన్నారు. ఆ నిధులతో దళితులకు దాదాపు 2 లక్షల 60 వేల ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టవచ్చని జీవన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ బలహీన వర్గాలకు అండగా ఉంటుందని ప్రజల ఆవేదనను తెలిపేందుకే జన ఆవేదన సభ నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారనే మాటలను నమ్మిన తెలంగాణ ప్రజలు టిఆర్‌ఎస్‌ను గెలిపించారని ప్రజలకు ఇచ్చిన మాటను ప్రక్కన పెట్టిన కెసిఆర్‌ దళితుడిని అణగ దొక్కి ముఖ్‌యమంత్రి పీఠంపై కూర్చొని రాజబోగాలు అనుభవిస్తున్నాడని అన్నారు. కెసిఆర్‌ నిర్ణయాల వల్ల రాష్ట్రంలోని 240 మంది గిరిజన మెడిసిన్‌ విద్యార్థులు డాక్టర్‌
సీట్లను కోల్పోయి తీవ్ర అన్యాయానికి గురయ్యారని అన్నారు. కాంగ్రెస్‌ సెక్యులర్‌ విదానాలనే అవలంబిస్తుందని, అన్ని వర్గాలను కలుపుకొని పరిపాలన కొనసాగిస్తుందని అన్నారు. కాంగ్రెస్‌ ప్రాజెక్‌‌టల నిర్మాణాలకు అడ్డంకిగా మారిందని ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఎన్ని ప్రాజెక్‌‌టలు నిర్మించిందో చూపించాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలనలోనే రాష్ట్రంలో నాగార్జున సాగర్‌, శ్రీశైలం, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్‌‌టలు నిర్మించామని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన నిబంధనల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులచే రాష్ట్రంలో నిర్మించే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్‌‌టకు జాతీయ ప్రాజెక్‌‌ట హోదా దక్కే అవ… కాశం ఉందన్నారు. అలాంటి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేని కెసిఆర్‌ అసమర్ధ పాలనకు నిదర్శనం అని అన్నారు.   ఈ సమావేశంలో ఎఐసిసి జాతీయ పరిశీలకుడు పెంటేష్‌ కుమార్‌, రాష్ట్ర నాయకులు మృత్యుంజయం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ టి.విజయలక్ష్మిదేవేంధర్‌రెడ్డి, ఎంపిపి గర్వందుల మానసనరేష్‌, కాంగ్రెస్‌ ఉపా ద్యక్షుడు బండ శంకర్‌, పట్టణ అధ్యƒక్షుడు కొత్త మోహన్‌, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గిరినాగభూషణం, కొలుగూరి దామోదర్‌రావు, రవీంధర్‌రావు. దేవేంధర్‌రెడ్డి, భూక్య సరళ, అంకతి గంగాధర్‌, ముంజాల రఘువీర్‌గౌడ్‌, నరేష్‌గౌడ్‌, రాజేష్‌, రియాజ్‌, గంగాధర్‌, బింగి రవి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa