హైదరాబాద్, మేజర్‌న్యూస్: హైదరాబాద్ నగరంలోని జవహర్‌నగర్‌లోని నిసా కేంద్రం లో పుణె ఎస్‌ఐ స్వాతి మంగళవారం నాడు ఆత్మహత్య చేసుకుంది. తన గదిలో ఉరేసు కుని ఎస్ స్వాతి ఆత్మహత్య చేసుకుంది. పుణెలో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న స్వాతి తన స్నేహితురాలిని కలిసేందుకు ఈ నెల 24న హైదరాబాద్‌కి వచ్చింది. ఎస్‌ఐ స్వాతి స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీస్ ఉన్నతాధికారులు కేసు నమోదు చేసుకున్నారు. స్వాతి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa