హైదరాబాద్, మేజర్‌న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాదవ, కుర్మ కుటుంబాలు ఉండగా ఈ ఏడాది రెండు లక్షల యాదవ, కుర్మ కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేయాలని మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో నిర్ణయి ంచారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకం, మత్స్య రంగాల అభివృద్ధిపై రాష్ట్ర పశు సంవర్ధక పాడి, పరిశ్రమాభివృద్ధి, మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది రెండు లక్షల కుటుంబాలకు, వచ్చే ఏడాది మరో రెండు లక్షల కుటుంబాలకు గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయిం చినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. అసలు గొర్రెలు లేని యాదవ, కుర్మ కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. గొర్రెల పెంప కందారుల సొసైటీలలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రస్తుత కో ఆపరేటివ్ చట్టం ప్రకారం విధివిధానాలను ప్రతి సొసైటీ తప్పనిసరిగా పాటిం చాలన్నారు. లబ్దిదారుల ఎంపికకు ఉన్న మార్గదర్శకాలలో కొన్ని సవరణలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. యాదవ, కుర్మ కుటుంబాలకు ప్రభుత్వం 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి పునర్ఘా టించారు. గొర్రెల పెంపకంపై ఆధారపడిన ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ నిధుల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి పంపిణీ చేయాలని నిర్ణయం తీసు కున్నట్లు తెలిపారు. ఇతర రాషా్టల్ర నుంచి మా త్రమే గొర్రెలను కొనుగోలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. అయితే గొర్రెలను కొనుగోలు చేసిన ప్రాంతం లోనే ఇన్సూరెన్‌స చేసి ట్యాగ్ వేయించడం, రీ సైక్లింగ్ కాకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. గొర్రెల కొనుగోలుకు కేజీల లెక్కన ధర నిర్ణయించి రాష్ట్ర స్థాయి టెండర్లు పిలవడం జరుగుతుందన్నారు. ఈ టెండర్లు దక్కించుకున్న వారే లబ్ధి దారు లకు గొర్రెలను వారి గ్రామా లకు సరఫరా చేయాలని నిర్ణయిం చారు. ఈ సమావేశానికి మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేం దర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, జోగురామన్న, జగదీష్ రెడ్డి, పోచా రం శ్రీనివాస్‌రెడ్డితో పాటు గొర్రెల పెంపకందారుల కార్పొరేషన్ ఛైర్మన్ రాజయ్యయాదవ్, అధికారులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa