ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీపీఎంతో దోస్తీకి వైసీపీ చొరవ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 01:01 AM

  -కార్పోరేషన్‌ ఎన్నికలతో నాందిపలకనున్నారా !
  -తొలి ప్రయత్నం ప్రారంభించిన వైసీపీ
  -కార్పోరేషన్‌ ఎన్నికల్లో చూద్దామన్న సీపీఎం
  -వామపక్ష ఉద్యమాలకు మద్దతు ఇచ్చే యోచనల వైఎస్సార్‌ కాంగ్రెస్‌
  -భవిష్యత్‌ మైత్రికి ఇప్పటినుంచే బాటలు
  -రెండున్నరేళ్లలో ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత  కూడగట్టే యోచన
  -ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ః అధికార పక్షాలను ఎన్నికల్లో గద్దె దించేందుకు ఏ ప్రధానపార్టీ అయినా వామపక్ష పార్టీల మద్దతు తీసుకోవడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌రాష్ట రాజకీయాలలో మనం చూస్తూనే వచ్చాం. సార్వత్రిక ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉండటంతో సరిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వామపక్ష పార్టీలతో దోస్తీకి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చోరవ చూపుతోందా...? వామపక్షాలలో బలంగా ఉన్న సీపీఎం పార్టీతో మైత్రీ కోసం వైసీపీ నేతలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ విషయంలో సీపీఎం కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలసిపోయే విషయంలో స్పష్టత రాకపోయినా ఇంకా సమయమున్నందున ప్రస్తుతం ఆ చర్చ సాగలేదని తెలుస్తోంది. అయితే త్వరలో రాష్ట్రంలోని పెండింగ్‌ కార్పోరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో మాత్రం సీపీఎంతో వైసీపీ జత కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం.
సీపీఐ మాత్రం జనసేన పార్టీవైపు చూస్తుండటంతో ఆ పార్టీతో చర్చలకు ఇంకా వైసీపీ ప్రయత్నాలు కొనసాగించలేదని తెలుస్తోంది. ఇదిలావుంటే వామపక్ష పార్టీలతో స్నేహం కోసం గత కొద్ది నెలల నుంచి వైసీపీ ప్రయత్నాలు కొనసాగిస్తూనేవుంది. గత ఏడాది అక్టోబర్‌నెలలో బీమవరంలో మెగా ఆక్వాఫుడ్‌ పార్‌‌క సందర్శించేందుకు వెళ్లిన సిపిఎం రాష్టక్రార్యదర్శి పి.మధును అడ్డుకొని పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన్ని ఫోన్‌చేసి వై.ఎస్‌.జగన్‌ మాటామంతి కలిపారు. మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని తెలిపినట్లు సమాచారం. స్వయంగా వై.ఎస్‌.జగన్‌ సిపిఎం రాష్టక్రార్యదర్శి పి.మధుకు ఫోన్‌చేయడం వెనక ఉన్న ప్రధాన కారణం ఆ పార్టీలతో దోస్తీకి ముందస్తు చొరవేనా అన్న చర్చ నాడు రాజకీయ వర్గాల్లో సాగింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలలో కొన్ని ఆరుదైన సమ యాల్లో తప్పా అన్ని ఎన్నికల్లో అధికారపక్షాన్ని కూలదోయడంలో ప్రధాన పార్టీలు వామపక్ష పార్టీలతో కలసిన తరువాతే సాధ్యమైంది. గతంలోని అనేక ఉద్దంతాలు ఇందుకు ఉదాహ రణలుగా ఉన్నాయి.  ఈ నేపథ్యంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో సర్వం కోల్పోయిన వామపక్షాలు సైతం తిరిగి పుంజుకొనేందుకు ప్రజా ఉద్యమాలు బలోపేతం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలసివెలడం తమకు కలిసొ స్తుందన్న యోచనలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉన్నట్లు సమా చారం. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కార్పోరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికల్లో స్థానికంగా వామపక్ష పార్టీలతో అవ గాహన చేసుకొని అధికార టిడిపిని ఎదుర్కోవాలని వైఎస్సార్‌ కాం గ్రెస్‌ పార్టీ అధి నాయకత్వం తన పార్టీ నేతలకు ఇప్పటికే సూచిం చినట్లు తెలు స్తోంది. ఈ క్రమంలో సిపిఎం రాష్ట్ర నేతలతో ఇటీ వల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చర్చలు కూడా సాగించినట్లు సమాచారం.
టిడిపిని ఎదుర్కోవడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు...?
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం తనకు ప్రజల్లో ఆదరణ ఉందన్న విషయంపై ధీమాను ప్రదర్శిస్తునే ప్రజావ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యనిస్తున్నాయి. ఇందు కోసం రాష్ట్రంలో వామపక్ష పార్టీలతో దోస్తీకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటినుంచే చర్యలు తీసుకొంటున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ఎన్నో ఉద్దంతాలలో అధికార పక్షాన్ని కూలదోయడంలో ప్రధాన పార్టీలకు వామపక్ష పార్టీలు అండగా నిలబడటంతోనే సాధ్యమైందని రాజకీయవర్గాల విశ్లేషణ. గతంలో 2004లో సుధీర్ఘ పాదయాత్ర ద్వారా దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి నాడు కాంగ్రెస్‌ పార్టీకి ఆశేష ప్రజాద్దరణ కూడగట్టినా వామపక్షాలు సైతం తోడవ్వడంతోనే నాడు అధికారంలోనున్న టిడిపిని ఘోరంగా ఓడించగలిగాయని రాజకీయ వర్గాల విశ్లేషణ. ఇప్పుడు కూడా ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో ఒకప్పటి పరిస్థితి నుంచి అధికార టిడిపి కొంత బలంగా తయారైందన్న భావన కూడా రాజకీయ వర్గాల్లోవుంది. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలతో అంతే బలోపేతమవుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ముందున్న సవాల్‌ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఒకటి అని రాజకీయ వర్గాల్లో విశ్లేషణ. ఇందుకోసమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటినుంచే జాగ్ర త్తలు తీసుకొంటోందన్న ప్రచారం ఆ పార్టీ వర్గాల్లోనే సాగుతోంది. రాష్ట్ర ంలో వామపక్షాలు స్వతహాగా అధికా రంలోకి గానీ బలమైన ప్రతిపక్షంగా గానీ ఎదిగే పరిస్థితులు ఇప్పటి కిప్పుడు లేకపోయినా అధికార పక్షా నికి ప్రజావ్యతిరేకతను బలంగా కూడ గట్టడంలో మాత్రం ఆ పార్టీలు సఫలీ కృతమవుతాయన్న భావన రాజకీయ వర్గాల్లో వుంది. ఈ విషయాన్ని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ధృవీ ƒరిస్తాయి. ఈ నేపథ్యంలోనే వామప క్షాలతో దోస్తీకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం దృష్టి సారించినట్లు సమాచారం. త్వరలో ఏపీలో జరిగే పెండింగ్‌ మున్సిపల్‌, కార్పోరేషన్‌ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో స్థానికంగా అవగాహనతో వెళ్లండి అని పార్టీ నేతలకు వై.ఎస్‌.జగన్‌ ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు సమా చారం. ఈ నేపథ్యంలో వచ్చే సార్వ త్రిక ఎన్నికల్లోనూ వామపక్ష పార్టీల తో పొత్తు ఉండొచ్చని అంతర్గతంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ధృవీకరిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa