హైదరాబాద్, మేజర్‌న్యూస్ ః అనవసర సిజేరియన్లు చేసే వైద్యశాలల మీద కఠిన చర్యలు తప్పవని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి హెచ్చరి ంచారు. అనవసర సిజేరియన్లు చేస్తే ఆసుపత్రులను సీజ్ చేస్తామన్నారు. అలా ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక ఆసుపత్రిని సీజ్ చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేసే ఆపరేషన్లకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా తప్పనిసరిగా పంపాల్సిందేనని ఆయ న తేల్చి చెప్పారు. ఎఎన్‌ఎంలకు ఆన్ లైన్ ట్యాబ్ బేస్‌డ యాప్‌ను మంగళవారం సచివాలయంలోని తన చాంబ ర్లో మంత్రి విడుదల చేశారు. ట్యాబ్‌లను ఎఎన్‌ఎంలకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లా డుతూ, రాష్ట్రంలో అనేక చోట్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసర సిజేరియన్లు జరుగుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. ఇక నుంచి అనవసర సిజేరి యన్లు, ఇతర శస్త్ర చికిత్సలు చేసే వైద్యశాలల పట్ల కఠిన ంగా వ్యవహరిస్తామన్నారు. శస్త్ర చికిత్సల ప్రోటోకాల్ ఉంటుందని, ఆ వివరాల ద్వారా అవనసర ఆపరేషన్లని గుర్తించొచ్చన్నారు. శస్త్ర చికిత్సల వివరాలు పంపని హాస్పి టల్‌స మీద కూడా చర్యలు తప్పవన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa