ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివశంకర్‌ మరణం తెలంగాణకు తీరనిలోటు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 01:15 AM

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ః కేంద్ర మంత్రిగా, వివిధ రాషా్టల్ర  గవర్నర్‌ గా పనిచేసిన శివశంకర్‌ సమాజం పట్ల మంచి అవగాహన ఉన్న నాయకు డని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.  కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్‌ మర ణం తెలంగాణకు తీరని లోటని ఆయన అన్నారు. సోమవారం మరణించిన శివశంకర్‌ అంత్య క్రియలు మంగళవారం జరిగాయి. ఈ సంద ర్బంగా జరిగి అంతిమయాత్రలో భాగంగా శివ శంకర్‌ భౌతికఖాయాన్ని గాంధీభవన్‌లో పార్టీ కార్య కర్తలు, నేతల సందర్శనార్ధం ఉంచారు.   ఈ సందƒ ర్భంగా శివశంకర్‌కు నివాళులర్పిస్తూ,  కాంగ్రెస్‌ నాయకులు రెండు నిమిషాలు మౌనం పాటిం చారు. అనంతరం ఉత్తమ్‌  మాట్లాడుతూ  కాంగ్రెస్‌ పార్టీలో శివశంకర్‌ క్రియాశీల నాయకునిగా పనిచేసి కేంద్రంలో మంత్రి గా,  సిక్కిం, కేరళ గవర్నర్లుగా పనిచేసి పదవులకే వన్నె తెచ్చారన్నారు.  నిరుపేద కుటుంబంలో జన్మించిన శివశంకర్‌ ఎంతో కష్టపడి విద్యనభ్యసించి న్యాయమూర్తిగా, రాజకీయ నాయకునిగా, కేంద్ర మంత్రిగా, గవర్న ర్‌గా  అనేక పదువులు అధిరోహించరన్నారు.  శివ …శంకర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్య నిర్వాహక అధ్య క్షులు భట్టి విక్రమార్క, మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ, మాజీ పార్లమెంట్‌ సభ్యులు వి.హను మంతరావు, మాజీ ఎంపీలు అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మల్లు రవి, ఎం.ఎల్‌.సిలు మాదం రంగా రెడ్డి, ఆకుల లలిత, మాజీ  మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి, టిపిసిసి నాయకులు కుమార్‌ రావు, ప్రేమ్‌ లాల్‌, బొల్లు కిషన్‌, లక్ష్మణ్‌కుమార్‌ గౌడ్‌, అజ్మతుల్లా హుసేనీ, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు  అనిల్‌ కుమార్‌ యాదవ్‌, మిహళాకాంగ్రెస్‌ అధ్యక్షురాలు  నేరేళ్ళ శారద  తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం గాంధీభవన్‌ నుంచి పూరానాఫూల్‌  స్మశాన వాటికకు శివశంకర్‌ భౌతికఖాయాన్ని  తరలించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa