ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవినీతిపైనే కేసీఆర్‌ దృష్టి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 01:31 AM

-కూలగొట్టాలి కట్టాలి కమిషన్‌ కొట్టాలన్నదే సీఎం ధ్యేయం 
-కోర్టులో పిల్‌ వేస్తే కేసీఆర్‌ ఎందుకంతా భయం 
-అర్హత లేని వారికి కాంట్రాక్టులు కట్టబెట్టినందుకే తమ పోరాటం
-మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి
హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పనులు ఎలా పూర్తి్త చేయాలన్న దానిపై  కాకుండా ముఖ్యమంత్రి  కేసీఆర్‌ తన వాటాల కోసం  అవినీతి మీదనే దృష్టిసారించారని   మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపిం చారు. కూలగొట్టాలి...కట్టాలి..కమిషన్‌ కొట్టాలన్నదే  కేసీఆర్‌ అజెండా మారిం దని విరుచుకుపడ్డారు. మంగళవారం ఆయన  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజా ప్రయోజన వాజ్యాలు వేస్తే కేసీఆర్‌కు ఎందుకు చెమటలు పడుతున్నాయని ప్రశ్నించారు. అభివృద్ధిని  అడ్డుకుంటున్నారని తనపై చేస్తున్న విమర్శలు అర్ధరహితమని ఆయన అన్నారు.  అర్హత లేని వారికి పనుల కాం ట్రాక్టులు ఇచ్చినందుకే కోర్టుకు వెళ్తున్నామని చెప్పారు. అవినీతి మీద పోరాటం తమకేమి కొత్త కాదన్నారు. ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకే ప్రతి పక్షాలను కలుపుకున్నారని  ఎద్దేవా చేశారు. కోర్టుకు వెళ్లడం నేరం కాదని, అది తమ రాజ్యాంగ హక్కు అని స్పష్టం చేశారు. పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేయలేని వారికి పనులెలా ఇచ్చారని ప్రశ్నించారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడతావా?,  కాళేశ్వ రం మీద ఎవరూ పిల్‌ వెయ్యలేదని అయినా అనుమతులు ఏమయ్యా ంటూ నాగం  నిలదీశారు. అవినీతిపై ముఖ్యమంత్రి  చర్చకు రావా లన్న ఆయన  లేదంటే ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని  పంపిస్తే  సాక్ష్యాధారాలతో రుజువు చేస్తాన …న్నారు.  పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల నిబంధనలు మార్చి కాంట్రాక్టర్లకు మేలు చేయాలని కేసీఆర్‌ ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌, హరీష్‌ రావుకు 12 శాతం కమిషన్లు అందాయని చెప్పారు.  కేసీఆర్‌పై ఎవరు విమ ర్శలు చేసినా ఎదురుదాడులు చేస్తారని, సన్నాసులు అంటారని ఆయన మండి పడ్డారు. విమర్శలు, కేసులు వేసేవాళ్లంతా సన్నాసులా? అని ప్రశ్నించారు. సన్నాసులు అంటే చెడ్డవాళ్లు కాదని ఆయన అన్నారు. భవిష్యత్తులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, శశికళకు  పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని నాగం జోస్యం చెప్పారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa