తెలుగు యూనివర్సిటీ: తెలుగు భాషా సంస్కృతులను, కళలను పరిరక్షించుకుంటూనే శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన కోర్సును తెలుగువర్సిటీ ప్రారంభించడం అభినందనీయమని తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అన్నారు. నాంపల్లిలో గల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రారంభించిన డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికెట్ కోర్సుకు సంబంధించిన బ్రోచర్‌ను మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. తెలుగువర్సిటీ ఉపకులపతి ఆచార్య యశస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ యువతకు, గృహిణులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పించి తద్వారా ఉపాధి అవకాశాలను కల్పించానే సంకల్పంతోనే పరిష్కార్ టెక్నాలజీస్ ప్రెయివేట్ లిమిటెడ్ సహకారంతో డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించినట్లు వివరించారు. అతితక్కువ ఫీజుతో రెండు నెలల కోర్సును రూపకల్పన చేసినట్లు ఆయన వెల్లడించారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఓఎస్‌డి శ్రీనివాసులు, తెలుగువర్సిటీ రిజిస్ట్రార్ వి. సత్తిరెడ్డి, కంప్యూటర్ విభాగం సంచాలకులు ఆచార్య కె. సుధీర్‌కుమార్, కోర్సు శిక్షకులు ముకుంద్, ప్రణతి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa