ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రగ్స్ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు : తలసాని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 26, 2017, 01:37 PM

హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలంపై మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు పట్టించుకోనందునే రాష్ట్రంలో డ్రగ్స్ విస్తరించిందన్నారు. డ్రగ్స్ వ్యవహారాన్ని మొత్తం సినీ పరిశ్రమకు ఆపాదించడం సరికాదన్నారు. సిట్ వద్ద ఉన్న సమాచారంతో కొందరిని మాత్రమే విచారిస్తున్నారని తెలిపారు. సిట్ విచారణలో వెల్లడైన వాస్తవాల ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు. సిట్ విచారణ పూర్తయ్యాక సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశం అవుతామని ప్రకటించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. చిత్ర పరిశ్రమలో నెలకొన్న పలు సమస్యలను చర్చలతో పరిష్కారించామని వెల్లడించారు. ఇంకా కొన్ని సమస్యలున్నాయి.. వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి తలసాని పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa