హైదరాబాద్ : టీ - శాట్ నెట్‌వర్క్‌ను మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. టీ శాట్ నెట్‌వర్క్‌తో పాటు లోగో, స్టేషన్ ఐడీనీ మంత్రులు ఆవిష్కరించారు. టీ శాట్ థీమ్ సాంగ్‌ను అంబేద్కర్ వర్సిటీ వీసీ సీతారామరావు, విద్య చానల్ లోగోను లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మన టీవీ సీఈవో శైలేష్ రెడ్డి, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, మీసేవ కమిషనర్‌తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మన టీవీలో నిరుద్యోగులకు ఉపయోగపడే సమాచారం అందించామని తెలిపారు. టీ శాట్ 70 లక్షల ఇండ్లకు చేరువైందన్నారు. లక్షలాది మంది విద్యార్థులకు విలువైన సమాచారం అందించామని మంత్రి పేర్కొన్నారు. యూట్యూబ్ చానల్, యాప్ ద్వారా టీ శాట్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. టీ శాట్ ద్వారా విద్యార్థులు, రైతులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా టీశాట్ పని చేస్తుందన్నారు. నిపుణ ద్వారా రైతులకు ఉపయోగపడే సమాచారం అందిస్తామన్నారు. గొర్రెలు, చేపల పెంపకంపై ప్రత్యే కార్యక్రమాలు ప్రసారం అవుతాయన్నారు. ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం కూడా అందిస్తామని కేటీఆర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa